రోజు వారి విటమిన్ ఇస్తున్న క్యూటీ

మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ ఆ అంచనాలన్ని తప్పు అయ్యాయి. అనూహ్యంగా అనుపమ కెరీర్ మలుపు తిరిగింది. `ప్రేమమ్` తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పెద్ద స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మీడియం రేంజ్ హీరోలకే పరిమితమైంది. ఆరకంగాను పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో `రౌడీ బోయ్స్`…`కార్తికేయ -2` చిత్రాలు మాత్రమే ఉన్నాయి. `రౌడీబోయ్స్` త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది.

ఆ సంగతి పక్కనబెడితే ఈ మల్లూ బ్యూటీ హెయిర్ స్టైల్ కి ఇటీవలే విజయ్ దేవరకొండ ఫిదా అయిన సంగతి తెలిసిందే. `రౌడీబోయ్స్` లో అనుపమ రింగుల హెయిర్ స్టైల్లో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈ హెయిర్ స్టైల్ ని ఉద్దశిస్తూ విజయ్ సూపర్బ్ అనే కామెంట్ కూడా చేసారు. రౌడీబోయ్స్ కోసం అనుపమని కొత్త లుక్ లో లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. హెయిర్ ట్రిమ్ చేసి రింగుల జుత్తు లోనే కొత్త లుక్ ట్రై చేసారు. ఈ లుక్ ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ హెయిర్ మరోసారి హైలైట్ చేస్తూ కొత్త ఫోటో సెషన్లో పాల్గొంది. క్రాక్ టాప్ క్యామిసోల్ ర్యాప్ డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

మల్లూ బ్యూటీ అనుపమ మరో హాట్ కామెంట్ కూడా విసిరింది. `ఇదిగో మీ రోజువారి విటమిన్ మీ` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ ఫోటోతో పాటు కామెంట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అనుపమ అభిమానులు కామెంట్లతో..ఎమోజీలతో ఎటాక్ చేసారు. ఏది ఏమైనా? రౌడీబోయ్స్ కి ఇదో రకమైన ప్రచారం అనాలేమో. ప్రస్తుతం ఈ సినిమాకి బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు సీరియస్ గానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజుగారు అనుపమని ప్రచారం పరంగా ఇలా రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది.

2021-22 సీజన్ అనుపమకు అన్నిరకాలా కలిసొస్తున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన జీఏ2 సంస్థ నిర్మిస్తున్న 18 పేజెస్ లో నటిస్తోంది. నిఖిల్ కార్తికేయ 2లోను నటిస్తోంది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే తమిళంలో తల్లి పోగతే విడుదల కావాల్సి ఉంది.హెలెన్.. తలై నగరమ్ 2 అనే చిత్రాల్లోనూ నటిస్తోంది.