లేడీ సూపర్ స్టార్ సినిమా రీమేక్ లో అనుష్క?

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ నెట్రికన్. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నయనతార యాక్షన్ కు అందరూ ఫిదా అవుతున్నారు. మిలింద్ రౌ ఈ చిత్రాన్ని రీమేక్ చేసాడు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతోందని తెలుస్తోంది.

అనుష్క ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారని వినికిడి. నెట్రికన్ ఒక కొరియన్ డ్రామా స్ఫూర్తిగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

అనుష్క శెట్టి నటించిన ఆఖరి చిత్రం నిశ్శబ్దం. దీని తర్వాత తెలుగులో సినిమా చేయలేదు అనుష్క. నవీన్ పోలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ పతాకంపై అనుష్క హీరోయిన్ గా సినిమా ఎప్పటినుండో వార్తల్లో ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.