మళ్లీ అనుష్క పెళ్లి ముచ్చట!

సినిమాల్లో ఆఫర్లు రావడమే గగనంగా భావిస్తూ ఉంటారు కొందరు. హీరోయిన్ గా నటించాలనుకునే వారు ఎన్ని కష్టాలు పడుతుంటారో మన అందరికి తెల్సిందే. ఒక సారి స్టార్ డమ్ వచ్చిందంటే కోట్లలో పారితోషికాలు వస్తూ ఉంటాయి. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని కోరుకోరు. కోట్లు వస్తున్నా కూడా వాటిని వద్దనుకునే వారు తక్కువ మంది ఉంటారు. బాహుబలి వంటి బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చి పాన్ ఇండియా హీరోయిన్ గా ఆఫర్లు వచ్చే సమయంలో ఈ అమ్మడు అనూహ్యంగా సినిమాలను బాగా తగ్గించింది. కోట్ల పారితోషికంతో వచ్చిన ఆఫర్లను కూడా అనుష్క కాదన్నది అనేది టాక్. కొద్ది మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. కాని అనుష్క మాత్రం హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. సరే పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గించిందా అనుకోవడానికి ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. చాలా ఏళ్లుగా అనుష్క పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి కాని ఇప్పటి వరకు ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు.

అనుష్క ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు వార్తలు వచ్చాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అభిమానులు కూడా కోరుకున్నారు. కాని ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ వారు పదే పదే చెప్పడంతో ఈమద్య కాలంలో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. అనుష్క వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు అనుష్కను రెండవ పెళ్లి చేసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలు ఎలా వచ్చాయో అలాగే కనుమరుగయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు చెప్పాడు అంటూ అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనుష్క జాతకం ప్రకారం 39వ ఏట ఆమె అవివాహితగా ఉండే అవకాశం లేదు. అంటే ఆమె వచ్చే బర్త్ డే వరకు ఖచ్చితంగా పెళ్ల చేసుకుని తీరుతుందని ఆయన చెబుతున్నాడు. 39 ఏళ్ల తర్వాత ఆమె వివాహిత అవ్వక పోవడం అనేది జరగదని.. ఆమె జాతకం ప్రకారం వివాహ యోగ్యం ఉంది.. అది కూడా 39 ఏళ్ల వరకు వివాహం చేసుకుంటుంది అంటూ ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.

అనుష్క సినిమాల కోసం అభిమానులు ఎదురు చూసి చూసి ఇక వదిలేశారు. ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడం మానేశారు. మీడియాలో కూడా అనుష్క గురించిన కథనాలు చాలా వరకు తగ్గాయి. ఆమె గురించిన వార్తలు వచ్చినా కూడా జనాలు సరేలే అనుకుంటున్నారు. ఆమె సినిమా ఏదైనా చేస్తుంది అంటే చేసినప్పుడు చూద్దాం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది నిశబ్దం సినిమా తర్వాత అనుష్క సినిమా ల్లో నటించే ఆసక్తినే వదిలేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ లో మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా ను ప్లాన్ చేస్తున్నారు. అందులో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు దాని అప్ డేట్ కూడా లేదు. మొత్తానికి సినిమా ల గురించి అనుష్క ఆలోచిస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది అంటూ సిద్దాంతి చెప్పడంతో అసలు అనుష్క స్పందన ఏంటీ అంటూ అభిమానులు మరోసారి చర్చించుకుంటున్నారు. అనుష్క పెళ్లి ముచ్చట వచ్చిన ప్రతిసారి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. కాని అసలు విషయాన్ని అనుష్క మాత్రం వెళ్లడించడం లేదు.