ఇంతకీ అనుష్క పోలవరం ఎందుకు వెళ్లినట్లు?

అనుష్క శెట్టి ఈ మధ్య తను చేసే సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గగనమన్న తరహాలో ఆమె సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటిటిలో విడుదలైంది. దీనికి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క చేయబోయే చిత్రం ఏదనే విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.

అయితే ఆమె రెండు చిత్రాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు కూడా 2021లో షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. అందులో ఒక చిత్రంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడట. ఈ సినిమాలో నటించడానికి అనుష్క ఏకంగా 3 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకున్న డిమాండ్ మేరకు నిర్మాతలు ఆ మొత్తం ఇచ్చుకోక తప్పలేదు.

ఇదిలా ఉంటే అనుష్క పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రత్యక్షమైంది. మరి పోలవరం దర్శనానికి వెళ్లిందో లేక ప్రత్యేకమైన పూజల కోసం వెళ్లిందో అన్న క్లారిటీ లేదు. అనుష్కకు దైవ భక్తి చాలా ఎక్కువ. పోలవరం వద్ద గల మహా నందీశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.