అరణ్య కత్తిరింపులు పని చేయలేదు

రానా హీరోగా సల్మాన్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ అరణ్య ఆశించిన స్తాయిలో మెప్పించలేదు అనేది టాక్. రివ్యూలు ఒక మోస్తరుగా సినిమా ఉంది అంటూ వస్తున్నా కూడా అసలు విషయం ఏంటీ అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సినిమా అయిదు కోట్లను మించి వసూళ్లు చేయడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. ఈ సినిమా లో రానా అడవి మనిషిగా కనిపించాడు. ఇలాంటి పాత్రలు చేసేందుకు ఒప్పుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. కాని రానా ఇంకాస్త బెటర్ గా సినిమా వచ్చేలా చూసి ఉండాల్సిందని అంటున్నారు.

సినిమా ఫైనల్‌ ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత రెండున్నర గంటలకు పైగా ఉండటంతో నిర్మాత సురేష్‌ బాబు కాస్త ఆలోచించి ఇది అంత సమయం చూడటం కష్టమే అనుకుని తగ్గించే ప్రయత్నం చేశాడు. సినిమాను విడుదలకు రెండు మూడు రోజులు ఉండగా దాదాపుగా అరగంట పాటు తగ్గించారు. సినిమాలో మరో హీరో విష్ణు విశాల్‌ ఉన్న సీన్స్ ను మరియు ఏనుగులు ఉన్న సీన్స్ ను తగ్గించారు. రానా పాత్ర విషయంలో కూడా కాస్త ట్రిమ్ చేశారట. అంతగా తగ్గించినా కూడా సినిమా ఫలితం మారలేదు. పాపం రానా చాలా కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది.