రెడ్ హాట్ బికినీ: తథేకంగా నన్నే చూశారా తస్మాత్ జాగ్రత్త!


అందాల భామల బికినీ బీచ్ సెలబ్రేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా మహమ్మారీ క్రైసిస్ లో బాలీవుడ్ టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలంతా మాల్దీవుల విహారంలో బ్లూ వాటర్ స్పోర్స్ట్ ని ఒక రేంజులో ఎంజాయ్ చేశారు. బీచ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఆ ఫోటోల్ని షేర్ చేయగా అవన్నీ సునామీ స్పీడ్ తో దూసుకెళ్లాయి.

కాజల్ – కియరా- పరిణీతి- జాన్వీ -సారా కారేరీ బికినీలకనర్హం అన్న చందంగా చెలరేగారు. అయితే ఆ బికినీలన్నిటిలో ఇదిగో ఇదే స్పెషల్ అన్నంతగా చెలరేగిన ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టగలరా? ఈత దుస్తులలో బ్యాక్ ఫీట్ లో కనిపిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు ఆడియెన్ కి సుపరిచితమే. ఈ బ్యూటీ ఇంతకుముందు సందీప్ కిషన్ సరసన నటించింది. పేరు అమైరా దస్తూర్. సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడడం అమైరా ప్రత్యేకత.

తాజాగా రెడ్ హాట్ బికినీని వెనక ఫీటుగా ప్రదర్శిస్తూ వేడెక్కించింది అమైరా. క్రిస్-క్రాస్ ఆరెంజ్ బికినీ కం స్విమ్ సూట్ లో ఒంపు సొంపుల వయ్యారాల్ని వడ్డించింది. అమైరా దేహశిరులు విశ్వంలోని నాలుగు అంశాలను కూడా డీకోడ్ చేస్తున్నాయ్.

“భూమి- నా శరీరం.. గాలి- నా శ్వాస.. అగ్ని- నా సంకల్పం. నీరు- నా రక్తం“ అంటూ అమైరా ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. `గోవా డైరీస్`.. `కాసా వాటర్స్` “వారాంతపు ఎస్కేప్`..`వాటర్ బేబీ`..ప్రకృతి పిల్ల` అనే హ్యాష్ ట్యాగ్ లతో ఈ ఫోటోని వైరల్ చేసారు. ఇక అమైరా మెడపై ఈవిల్ ఐ పచ్చబొట్టును చూశారు కదా? తనని తథేకంగా చూస్తే భస్మమైపోతారనేది దాని సారాంశం. తస్మాత్ జాగ్రత్త!!