ఆర్యన్ ఖాన్ కు ఆరోగ్య పరీక్షలు.. ఏం తేలిందంటే?

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు 27 రోజులు ముంబై ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బడా లాయర్ ముకల్ రోహత్ గీ వచ్చి వాదిస్తే కానీ బెయిల్ రాలేదు. ఎట్టకేలకు బెయిల్ రావడంతో ఫార్మాలటీస్ అన్నీ పూర్తయ్యేసరికి రెండు రోజులు పట్టింది. నిన్న శనివారం ఉదయం విడుదలయ్యాడు. మధ్యాహ్నం తన నివాసం మన్నత్ లో షారుఖ్ కుమారుడు ఆర్యన్ అడుగుపెట్టాడు. ఆర్యన్ రాకతో షారుఖ్ నివాసం ‘మన్నత్’ లో పండుగ వాతావరణం నెలకొంది. కొన్నిరోజుల ముందే దీపావళి పండుగ వచ్చేసింది.

ఆర్యన్ ఖాన్ వచ్చేయడంతో షారుఖ్ ఫ్యాన్స్ అంతా ఆర్యన్ కు గ్రాండ్ గా స్వాగతం చెప్పారు. డప్పులు కొట్టి తమ ఆనందం తెలియజేశారు. అన్ని మతాలకు చెందిన పెద్దలు వచ్చి మతప్రార్థనలు చేశారు. ఆర్యన్ మాత్రం ఎక్కడా ఆగలేదు. కారు నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయింది. అట్టు అంటు నేరుగా తన బెడ్ రూంలోకి వెళ్లిపోయాడు ఆర్యన్.

ఆర్యన్ ఇంటికి రావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు పరామర్శించడానికి షారుఖ్ నివాసానికి వచ్చారు. కానీ షారుఖ్ వారందరిని వారించాడు. కొన్ని రోజులు ప్రైవసీ కావాలని కోరాడు. ఆర్యన్ వచ్చిన సమయంలో షారుఖ్ ఇంట్లో జూహీచావ్లా మాత్రమే ఉంది. ఇంట్లో సంబరాలు ఏం చేసుకోలేదు. ఆర్యన్ కు ఇష్టమైన మిఠాయిలు వండిపెట్టినట్టు తెలిసింది.

ఇక ఆర్యన్ ఖాన్ కు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. కంప్లీట్ హెల్త్ చెకప్ తర్వాతే ఆర్యన్ ను పరామర్శించేందుకు షారుఖ్ అనుమతి ఇచ్చాడు. ఆర్యన్ ఫ్రెండ్స్ ను కూడా కొన్నాళ్ల పాటు ఇంటికి రావద్దని షారుఖ్ చెప్పాడట.. ప్రత్యేకంగా ఆర్యన్ కు కౌన్సిలింగ్ ఇప్పించాలని.. కొన్నాళ్ల పాటు ప్రత్యేకమైన డైట్ ప్లాన్ అమలు చేయాలని షారుఖ్ డిసైడ్ అయ్యాడట..

ప్రస్తుతానికి ముంబై దాడి బయటకు వెళ్లడానికి ఆర్యన్ కు అనుమతి లేదు. సో ఇంట్లోనే ఉండనున్నాడు. వెళ్లాలంటే ఎన్సీబీ అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రతీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి.