పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో వీరాభిమానులు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో అషురెడ్డి కూడా ఒకరు అనడంలో సందేహం లేదు. ఆమె ప్రైవేట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ పేరును పచ్చ బొట్టు వేయించుకుని తన అభిమానంను చాటుకున్న విషయం తెల్సిందే. అంతటి అభిమానంను తన గుండెల్లో దాచుకున్న అషు రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఇటీవల ఆయన నటిస్తున్న ఒక సినిమా లో అషు రెడ్డి నటిస్తుంది. ఆ సందర్బంగా ఆమె తో పవన్ మాట్లాడటం జరిగిందట. దాంతో పాటు పవన్ చేతితో లేఖ రాసి ఇచ్చాడు.
పవన్ లేఖ ను షేర్ చేసి ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిందని కొన్ని వెబ్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. దాంతో ఆమె చాలా సీరియస్ గా స్పందించింది. తన గురించి తప్పుడు కథనాలు రాస్తున్న వారికి ఇదే హెచ్చరిక అంటూ.. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు అభిమానం. ఆయన అంటే గౌరవం. అంతే తప్ప మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తానేం ప్రకటన చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే నాకు దేవుడు అని మరోసారి చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులను కలవడానికి కూడా భయపడేలా ఇలా చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.