జూ.సమంత తో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ..!

కాంట్రవర్సీ కింగ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఏమి చేసినా సంచలనమే. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా పోస్టులు – ఇంటర్వ్యూలతో కూడా సంచలనం రేపుతాడు. నేను ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తా అని నిక్కచ్చిగా చెప్పే వర్మ.. ఇతరులకు కూడా పబ్లిసిటీ తెచ్చి పెడుతుంటారు. ఆర్జీవీ క్రేజ్ ని వాడుకొని పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వర్మతో ఒక్క ఇంటర్వ్యూ చేసిన యాంకర్ అరియానా.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కు వెళ్లేంత పాపులారిటీ తెచ్చుకోవడం మనం చూశాం. దీంతో ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తే ఫుల్ ఫేమస్ అవుతామనే ఆలోచనతో చాలా మంది యంగ్ బ్యూటీస్ ఉన్నారు.

ఇప్పటికే ఆర్జీవీ ఇంటర్వ్యూల వల్ల అనేకమంది న్యూస్ యాంకర్లు.. యూట్యూబ్ ఛానళ్ల లేడీ యాంకర్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ‘బిగ్ బాస్’ ఫేమ్ అషూ రెడ్డి వంతు వచ్చింది. వర్మ కన్ను అషూ పై పడిందో లేదా.. వర్మను ఇంటర్వ్యూ చేయాలని అషూ అనుకున్నారో తెలియదు కానీ.. వీళ్ళిద్దరూ ఒకచోట చేరారు. ‘అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ’ తరహాలోనే ‘అషూ బోల్డ్ ఆర్జీవీ’ అనే ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఓ వీడియోని అషూ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పొట్టి బట్టలు వేసుకున్న అషూ ఓ కుర్చీలో కూర్చొని ఉంటే.. ఎదురుగా ఉన్న వర్మ కిందకు వంగి ఆమె తొడల మీద ఫోకస్ పెట్టి ఫోటోలు తీస్తున్నాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంటర్వ్యూ ప్రోమో రాకముందే ఇది ఎలా ఉంటుందో అర్థం అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా దీనిపై స్పందించారు.

”ఈ వీడియోలో ఎడమ వైపు ఉన్నది నేను కాదు.. కుడి వైపున ఉన్నది అషూ రెడ్డి కాదు. మేము ‘అరియానా బోల్డ్ ఆర్జీవీ’ మాదిరిగా ‘అషూ బోల్డ్ ఆర్జీవీ’ అనే ఇంటర్వ్యూ చేయలేదు. ఇది నేను అన్ని దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నాను. కానీ దేవతల మీద ప్రమాణం చేయడం లేదు” అని వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దీనిని బట్టి మరో బోల్డ్ ఇంటర్వ్యూ రెడీ అవుతోందనేది అర్థం అవుతోంది.

‘అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ’ లో ఇద్దరూ జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ షాకింగ్ విషయాల గురించి డిస్కష్ చేసిన విషయం తెలిసిందే. అరియానా బాడీ పార్ట్స్ ని వర్మ వర్ణించిన తీరు.. ఆమెను వీడియోలో చూపించిన యాంగిల్స్ అందరినీ షాక్ కి గురి చేసాయి. మరి ఇప్పుడు అషూ తో వర్మ ఎలాంటి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారో.. అందులో ఎలాంటి విషయాల గురించి చర్చించారో.. జూనియర్ సమంత ని ఏ యాంగిల్స్ లో చూపిస్తారో ప్రోమో వస్తేగానీ తెలియదు.