బాలయ్య ‘క్రాక్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఈ ఏడాది ఆరంభంలో రవితేజకు క్రాక్ వంటి మాస్ సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్యతో సినిమాకు సిద్దం అవుతున్నాడు. అఖండ సినిమాను ముగించిన బాలయ్య తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు గత కొన్ని రోజులుగా ఒకొక్కటి చొప్పున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా త్రిష నటించబోతుంది. వీరిద్దరి కాంబో ప్రత్యేకంగా ఉంటుందని.. మరో హీరోయిన్ ను కూడా ఈ సినిమాలో నటింపజేస్తాడనే వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ఈ సినిమా యూనిట్ సభ్యుల నుండి లీక్ అయ్యింది.

యూనిట్ సభ్యులు మరియు మీడియా వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. రెండు పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు. ఒక పాత్ర లో పల్నాటి ఫ్యాక్షనిస్ట్ గా కనిపించబోతుండగా మరో పాత్రలో కాస్త సీనియర్ ఆద్యాత్మిక వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఈ రెండు పాత్రలు కూడా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా దర్శకుడు చక్కగా డిజైన్ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో షూటింగ్ కు వెళ్లబోతున్న ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వస్తూ అంచనాలు పెంచబోతున్నాయి.

అఖండ సినిమాలో మాత్రమే కాకుండా అంతకు ముందు నటించిన పలు సినిమాల్లో కూడా బాలయ్య డబుల్ రోల్ లో నటించాడు. ఆ సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ అవ్వగా కొన్ని మాత్రం నిరాశ పర్చాయి. మొత్తంగా చూసుకుంటే బాలయ్యకు డబుల్ రోల్ అనేది సెంటిమెంట్ గా కలిసి వస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తే.. రెండు పాత్రలు ఒకేసారి తెరపై కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య అఖండ సినిమా ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు విడుదల తేదీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వక పోవడంతో విడుదల విషయమై మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.