చెంపదెబ్బకి బాలయ్య అభిమాని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నభూతో నభవిష్యతి.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అవును మరి, గూబ పగలగొట్టి.. వెన్నపూస రాయడమెలాగో బాగా తెలుసు బాలయ్యకి. ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళి అభిమాని గూబ పగలగొట్టడమేంటి.. మతి లేని చర్య కాకపోతే.! అయినా, బాలయ్యకు ఇవన్నీ మామూలే. కొడతాడు.. దెబ్బతిన్నోడే, ‘అబ్బనీ తియ్యనీ బాలయ్యబాబు బెద్బ’ అనేలా చేస్తాడు. దటీజ్ బాలయ్య. అయితే, ఇలా ప్రతిసారీ బాలయ్య చేతిలో దెబ్బ తినడం అభిమానులకు పరిపాటిగా మారిపోయింది. తద్వారా ఆయా అభిమానులకు మీడియాలో స్పేస్ దక్కుతోంది. అందుకేనేమో, ఎగబడి మరీ కొట్టించేసుకుంటారు.. అన్నది ఇంకో సెటైర్.
అబ్బే, అదేం కాదు.. ఆవేశంలో కొట్టేసి.. తప్పు తెలుసుకుని, క్షమాపణ చెప్పడంతోపాటు, ఎంతో కొంత ముట్టజెప్పుకోవడం ద్వారా బాలయ్య ఆ గొడవ నుంచి బయటపడుతుంటారన్నది ఇంకో వెర్షన్. ఈ చెల్లింపులవన్నీ బాలయ్య వెనకాల జరిగిపోతుంటాయ్ (అట). హిందూపురంలో చెంప దెబ్బ తిన్న అభిమానికి గట్టిగానే గిట్టబాటు అయ్యిందని చెప్పుకుంటున్నారు. అందుకేనేమో, ‘బాలయ్య బాబు టచ్ చేయడం చాలా ఆనందంగా వుంది’ అంటూ ఆ ‘స్పర్శ’ను గుర్తు చేసుకుని మైమర్చిపోయాడు బాలయ్య చేతిలో చెంప దెబ్బ తిన్న అభిమాని.
మరోపక్క, ‘మా బాలయ్య ఎంత గొప్పోడో..’ అంటూ బరిలో నిలిచిన అభ్యర్థుల చేత, టీడీపీ అను‘కుల’ మీడియా ద్వారా చెప్పించేశారు. ‘బాలయ్య వచ్చేదాకా ధైర్యం లేకుండా బతికాం.. బాలయ్య ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చారో.. మాకు కొండంత ధైర్యం వచ్చింది..’ అంటూ టీడీపీ అను‘కుల’మీడియా కెమెరాలు, మైకుల ముందు టీడీపీ అభ్యర్థులు చెప్పడం.. ఓ ప్రసహనంగా మారింది. ఎంత బాగా ప్రాక్టీస్ చేశారోగానీ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులో అక్షరం పొల్లుపోకుండా బాలయ్య మీద అభిమానాన్ని వల్లించేశారు. అద్గదీ అసలు సంగతి. బాలయ్యబాబు లెక్కే వేరప్పా.!
Share