త్వరలోనే రోడ్లపైకి వస్తా.. ప్రజల కోసం పోరాడతా: బాలకృష్ణ

సినిమా షూటింగ్ పూర్తవగానే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తీరుపై టీడీపీ నాయకులతో ఆదివారం బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందనని అన్నారు. ఇటివలి హిందూపూర్ లో కూడా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని.. ఆరోజు తాను ఒక్క సైగ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.

ఉత్తర భారతంలో కనిపించే పాలన ఏపీలో కనిపిస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో తనది జన్మజన్మల అనుబంధమని బాలకృష్ణ అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహించనని అన్నారు. త్వరలోనే ప్రజలందరినీ కలుస్తానని అన్నారు.