బాలయ్య మెచ్చిన ఉప్పెన

వైష్టవ్‌ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చి బాబు నటించిన ఉప్పెన సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్ నటనతో పాటు కృతి శెట్టి మరియు విజయ్‌ సేతుపతిల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా కు సినీ ప్రముఖులు మరియు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ ఈ సినిమాను చూసి ప్రశంసించాడు.

ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు బుచ్చి బాబును బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లుగా సమాచారం అందుతోంది. మైత్రి వారి బ్యానర్‌ లో బాలయ్య సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ అనుబంధంతోనే ఉప్పెన సినిమాను చూసి స్పందించినట్లుగా తెలుస్తోంది. బాలయ్య అభినందనలతో బుచ్చి బాబు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఇదే సమయంలో మోక్షజ్ఞ విషయాన్ని బుచ్చి బాబు వద్ద బాలయ్య ప్రస్థావించాడని, తన వారసుడి కోసం కథను సిద్దం చేయాల్సింగా కోరాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.