సాహసం: విగ్గు లేకుండా నటించనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ వయసు రీత్యా ఎప్పటినుండో విగ్గు వాడుతున్న సంగతి తెల్సిందే. సినిమా సినిమాకూ భిన్నమైన విగ్గు వాడుతూ బాలకృష్ణ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలో సహజమైన లుక్కులో కనిపించనున్నాడట. ముందుగా ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరిగింది. లాక్ డౌన్ సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఈ విషయంపై స్పందించాడు.

అఘోరా సెటప్ నిజమేనని అన్నాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో బోయపాటి అఘోర సెటప్ మొత్తాన్ని లేపేసాడట. దాని బదులు 60 పదుల పాత్రను సృష్టించాడట. బాలకృష్ణ నిజ వయసుకు దగ్గరగా ఉన్న పాత్ర కావడంతో ఈ పాత్ర కోసం విగ్గు లేకుండా నటించనున్నాడట బాలకృష్ణ. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం బాలకృష్ణ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్ట్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.