బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న బిబి3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఉగాదికి సినిమా టైటిల్ ను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఉగాది దగ్గర పడుతున్నా కూడా ఇప్పటి వరకు టైటిల్ ను ఖరారు చేయలేదని అంటున్నారు. సింహా అనే పదం వచ్చేలా టైటిల్ ను పెట్టాలని దర్శకుడు బోయపాటి మరియు బాలయ్యలు అనుకుంటున్నారట. అందుకు చాలా టైటిల్స్ ను పరిశీలించినా కథానుసారంగా సెట్ అవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో మోనార్క్ మరియు ఇతర టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. సింహా పదంతో టైటిల్ సెట్ అవ్వకుంటే అందులో నుండి ఒకటి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా బిబి3 సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు అనేది వాస్తవం.