బాలయ్య హోలీ సంబరాల ఫోటో వైరల్

నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన తప్పు చేస్తేనే కోప్పడతారు అని అంటారు ఆయన అభిమానులు. బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని అంటారు. ఎదుటివారు ఏమనుకుంటారు అన్నది పట్టించుకోకుండా తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దీనివల్ల కొన్నిసార్లు వివాదాల్లో కూడా నిలుస్తారు బాలయ్య.

ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న విషయం తెల్సిందే. ఈ సినిమా సెట్స్ లో బాలకృష్ణ ఇటీవలే హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్న పిల్లలతో కలిసిపోయి వారితో సరదాగా రంగులు పూస్తూ గడిపారు బాలకృష్ణ.

ఇక బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న సినిమాకు టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. మోనార్క్, గాడ్ ఫాదర్ వంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి కానీ సంస్కృతంలో అర్ధం వచ్చేలా ఒక పవర్ఫుల్ టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.