నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటివరకూ రివీల్ చేయని సంగతి తెల్సిందే.
ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు ఈ చిత్ర టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. టైటిల్ తో పాటు బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు లుక్స్ లు కనిపిస్తున్నాడు. అందులో ఒకటి అఘోరా గెటప్ అని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఉగాది రోజుకు వచ్చే అవకాశముంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
We know how long you have been waiting..
The much awaited #BB3TitleRoar to be revealed on this Ugadi💥13th April at 12:33PM.#BB3RoarOnMay28th #BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/grcqRt1402— Dwaraka Creations (@dwarakacreation) April 11, 2021