బాలయ్య – అనిల్ రావిపూడి : యాక్షన్ కూడా ఫన్ కూడా!!

నందమూరి బాలకృష్ణ తిరిగి హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. ఇందుకోసం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అఖండ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అఖండ టీజర్ సూపర్ హిట్ సాధించి చిత్రంపై ఉన్న అంచనాలను అమాంతం రెట్టింపు చేసింది.

అఖండ చిత్రం పూర్తవుతోన్న నేపథ్యంలో బాలయ్య తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్య ముందు చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికే ఓటు వేసినట్లు సమాచారం. అనిల్ చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చిందట.

ఈ నేపథ్యంలో అనిల్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. బాలకృష్ణ మాస్ యాంగిల్ ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ మాత్రమే కాకుండా ఫన్ ఎలిమెంట్ బాగా ఉండేలా అనిల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడట.