బాలయ్య సినిమా కోసం అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేస్తోన్న గోపీచంద్

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను సాధించాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో గోపీచంద్ మలినేనికి నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం లభించింది. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ పనులు మొత్తం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం 100 ఏళ్ల నాటి వేటపాలెం లైబ్రరీకు వెళ్లి మరీ సమాచారాన్ని సేకరించాడు మలినేని.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సంస్థ మలినేనికి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడి అభిరుచి మేరకు కాస్ట్ అండ్ క్రూ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న అఖండ పూర్తైన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారు. ఐతే వీళ్ళకి కథలో ప్రాధాన్యత బాగా ఉంటుందని అంటున్నారు.