ఎవరేం అనుకున్నా, ఎవరెన్ని కామెంట్లు చేసినా నందమూరి బాలకృష్ణ తాను అనుకున్నది చేసి తీరతాడు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ పలు మార్లు తనలోని సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టిన విషయం తెల్సిందే. మేము సైతం కార్యక్రమంలో రెండు పాటలను ఆలపించాడు బాలకృష్ణ. అలాగే గతేడాది శివశంకరీ పాటతో మనందరినీ అలరించాడు.
ఈ పాటకు కొన్ని ట్రోల్స్ వచ్చినా కానీ బాలయ్య పట్టించుకోలేదు. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ రామ దండకంతో మన ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. దీనికి కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. మరికొంత మంది బాలకృష్ణ డెడికేషన్ ను మెచ్చుకున్నారు.
ఏదేమైనా బాలయ్య మాత్రం తన గానానికి మరింత పదును పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో సాంగ్ ను పాడబోతున్నాడట. అయితే అది ఏ పాట, ఏ సందర్భానికి విడుదల చేస్తాడు అన్నది తెలియలేదు కానీ ప్రస్తుతం ఆ పాటను ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడట.