బాలయ్య డైలాగ్‌ చెప్పిన హైదరాబాద్‌ పోలీసులు

కరోనా కారణంగా కొన్ని నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఆపేసిన పోలీసులు ఎట్టకేలకు కొత్త సంవత్సరంకు ముందు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ ను మొదలు పెట్టారు. కొత్త సంవత్సరం అర్థ రాత్రి సమయంలో వందల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లు నిర్వహించారు. దీన్ని ఆపేయడం లేదని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం వీకెండ్స్ ఒల్లు దగ్గర పెట్టుకుని ఉండండి అంటూ పోలీసులు తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు.

బాలకృష్ణ లయన్‌ సినిమాలో అప్పుడే అయిపోయిందని అనుకోకండి, లోపల ఇంకా చాలా దాచి పెట్టాం అనే డైలాగ్ ఉంది. ఇప్పుడు అదే డైలాగ్‌ ను పోలీసులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అప్పుడే అయిపోయిందని అనుకోకండి, ఇంకా చాలా ఉంది. వీకెండ్‌ కు దాచి ఉంచాం అంటూ పోలీసులు మందుబాబులను హెచ్చరించారు. ముందు ముందు పెద్ద ఎత్తున డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లు నిర్వహిస్తాం అంటూ పోలీసులు బాలయ్య డైలాగ్ తో మందుబాబులను హెచ్చరించారు.