నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమాలో పెద్దగా స్టార్ డమ్ లేని ప్రగ్యా జైస్వాల్ తో బాలయ్య రొమాన్స్ చేశాడు. హీరోయిన్ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బాలకృష్ణ చేయబోతున్న తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాలనుకుంటున్నారట.
బాలకృష్ణ స్వయంగా తన సినిమాలో ఈసారి స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాల్సిందిగా దర్శకుడు గోపీచంద్ మలినేనికి సూచించాడట. ఆయన శృతి హాసన్ ను సంప్రదించగా ప్రస్తుతం డేట్లు ఖాలీలేవు అంటూ తేల్చి చెప్పిందట. దాంతో మరో హీరోయిన్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఇక బాలయ్య కు జోడీగా అంటే చాలా మంది హీరోయిన్స్ ఆసక్తి చూపించడం లేదు. ఇంకా కూడా బాలకృష్ణ కోసం హీరోయిన్ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కాని ఇప్పటి వరకు ఓకే అవ్వలేదట. వచ్చే నెలలో షూటింగ్ ను మొదలు పెట్టాలనుకుంటున్న ఈ సినిమాకు అప్పటి వరకు అయినా హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యేనా చూడాలి.