అన్ స్టాపబుల్ కు చిన్న గ్యాప్!!

నందమూరి బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా చేస్తున్న ఆహా వారి టాక్ షో అన్ స్టాపబుల్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు సందడి చేయగా రెండవ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని హాజరు అయ్యాడు.

మోహన్ బాబు మరియు నాని లు వచ్చిన రెండు ఎపిసోడ్స్ కు కూడా మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ వారితో జరిపిన చిట్ చాట్ మరియు ఆడిన ఆటలు అందరిని ఆకట్టుకున్నాయి. మొత్తంగా అన్ స్టాపబుల్ కు మంచి స్పందన వచ్చింది.

మూడవ ఎపిసోడ్ కోసం ఈ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అంటూ బాలయ్య అభిమానులతో పాటు ఆహా వీక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే మూడవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

సాదారణంగా అయితే ఇప్పటికే ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయాల్సి ఉంటుంది. కాని ఇప్పటి వరకు బాలయ్య మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయలేదు. అంటే ఈ శుక్రవారం అన్ స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లేకపోవచ్చు అంటున్నారు.

బాలయ్య కు చిన్న సర్జరీ అవ్వడంతో పాటు.. మూడవ ఎపిసోడ్ ను విజయ్ దేవరకొండతో ప్లాన్ చేయగా అతడు అమెరికాకు లైగర్ షూటింగ్ కోసం వెళ్లాడు. అక్కడ చకచక షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పూరి అండ్ టీమ్ ఇండియాకు తిరిగి రాబోతున్నారు.

అప్పుడు బాలయ్య ముందుకు విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. ప్రస్తుతం యూత్ స్టార్ గా మంచి క్రేజ్ ను దక్కించుకున్న విజయ్ దేవరకొండతో బాలయ్య అన్ స్టాపబుల్ అంటే ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ షో ఖచ్చితంగా మంచి ఆధరణ దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య.. మరియు రౌడీ స్టార్ల మద్య జరిగే చర్చలు ఏంటీ వారిద్దరు ఎలాంటి ఆటలు ఆడబోతున్నారు అనే విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఇద్దరు వేరు వేరు కారణాల వల్ల అందుబాటులో లేని కారణంగా షో కు చిన్న గ్యాప్ ఇచ్చి వచ్చే వారంకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పై ఆహా టీమ్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అన్ స్టాపబుల్ షో లో విజయ్ దేవరకొండతో పాటు ఇద్దరు ప్రముఖ దర్శకులు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకులతో కూడా బాలయ్య చిట్ చాట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ అన్నట్లుగా సాగిపోతూనే ఉంటుందట. టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో ఒకరు బాలయ్య షో కు హాజరు అయ్యేందుకు ఓకే అన్నారని.. త్వరలోనే ఆ విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. ఈ రెండు కాకుండా మరో రెండు సినిమాలు కూడా బాలయ్య లైన్ లో పెట్టాడు. ఒక వైపు సినిమాలతు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఆహా కోసం అన్ స్టాపబుల్ ను కూడా చేస్తున్న బాలయ్య ఓపికకు అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.