బాలయ్య – గోపీచంద్ సినిమా అప్డేట్!

నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో రోరింగ్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించి టాలీవుడ్ కు నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడు మరింత ధైర్యంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఇక బాలయ్య తర్వాతి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. రీసెంట్ గా లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. అలాగే శృతి హాసన్ కథానాయికగా ఎంపికైంది.

ఇదిలా ఉంటే బాలకృష్ణ భుజానికి జరిగిన శస్త్రచికిత్స కారణంగా షూటింగ్ వాయిదా పడింది. భుజానికి సపోర్ట్ తోనే బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య – గోపీచంద్ మలినేని చిత్ర జనవరి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.