ప్రివ్యూ వీక్షించి సింగరాయ్ పై NBK ప్రశంసలు

నటసింహా నందమూరి బాలకృష్ణకు నేచురల్ స్టార్ నాని అభిమాని అన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ వంటి అగ్ర హీరోలను తాను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటానని నాని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక నేచురల్ స్టార్ నానీని అగ్ర హీరోల అభిమానులంతా అభిమానించడం కామన్ గా చూస్తుంటాం. అది అతడికి ప్రధాన బలం.

అందుకే ఎన్ని పెద్ద సినిమాలు పోటీ బరిలో ఉన్నా కానీ నాని నటించిన సినిమాలకు ఎలాంటి డోఖా లేదు. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోవడం లేదు. ఇటీవలే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లలో బాలకృష్ణ నటించిన అఖండ.. మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తున్నా.. శ్యామ్ సింగరాయ్ తన వంతు షేర్ ని లాక్కోవడంలో ఎక్కడా తడబడలేదు.

పైగా పెద్ద సినిమాలకు వచ్చిన డివైడ్ టాక్ తనకు లేకపోవడంతో సింగరాయ్ రాయల్ గా సేఫ్ జోన్ కి వెళుతున్నాడు. ఇక ఇయర్ ఎండ్ ని రాయల్ మూవ్ మెంట్ తో ఎంతో సంతోషంగా ముగిస్తున్నామని సింగరాయ్ టీమ్ ప్రకటించింది. అది కూడా నటసింహా నందమూరి బాలకృష్ణ స్పెషల్ షో వీక్షించి సింగరాయ్ ని ప్రశంసించారు. స్క్రీనింగ్ లో బాలయ్యతో పాటు నాని-రాహుల్ సాంకృత్యన్.. వి.బోయనపల్లి తదితరులు ఉన్నారు. బ్లాక్ బస్టర్ క్లాసిక్ SSR ఫైర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు.