నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులతో కలిసి కారంచేడులోని సోదరి పురంధేశ్వరి ఇంట బాలయ్య ఎంతో వైభవంగా పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. కారంచేడులో గుర్రం ఎక్కి అభిమానులను అలరించారు. పండుగ సంబరాల్లో భాగంగా బాలయ్య కుటుంబసభ్యులతో కలిసి చీరాల బీచ్ లో సందడి చేశారు.
బాలకృష్ణను ఆయన కుటుంబసభ్యులను చూసేందుకు సమీప గ్రామాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం బాలయ్య ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ తో అలరిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు.