ఆ పని చేసిన వారి చేతులు నరికేయాలి: బాలయ్య

నందమూరి బాలకృష్ణ నేడు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆవేదన వ్యక్తం చేశారు.

దేవాలయాల్లో విగ్రహాలను దొంగిలించడం దాడులు చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్న వారిని వెంటనే పట్టుకుని వారి చేతులు నరికేయాలన్నాడు. ఈ సంఘటనను కేవలం ఖండించి వదిలి పెడుతుంది అంటూ ప్రభుత్వంపై బాలయ్య అసహనం వ్యక్తం చేశాడు.

విజయవాడ ఇంద్రకీలాద్రిలో మూడు వెండి విగ్రహాలు మాయమయ్యాయి, అంతర్వేదిలో రథంను బుగ్గి పాలు చేశారు. రాముడు, సీత విగ్రహాలను ద్వంసం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వమన్నది ఇందుకేనా అంటూ ఈ సందర్బంగా బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓట్లు అడిగేందుకు వారు వస్తారు. అప్పుడు వారిని నిలదీయండి అంటూ బాలయ్య అన్నాడు. బాలకృష్ణ ఈ సందర్బంగా చెప్పడిన డైలాగ్‌ కు ఆయన చెప్పిన మంత్రంకు మీడియా వారితో పాటు అక్కడున్న వారు అంతా కూడా ఆశ్చర్యపోయి నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు.