బాలయ్య డైలాగ్‌తో అద్భుతమైన వీడియో

దివంగత మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వరూపం నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా నిర్మాత, రామ్ ఆచంట సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘మరణం లేని జననం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేశారు. ఎన్టీఆర్‌ కుమారుడు, టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ డైలాగుతో మొదలయ్యే ఈ వీడియోను అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘ సింహం నిద్రలేచి. గడపదాటి జనంలోకి వచ్చి గర్జిస్తే..ఆ గర్జనకు ఢిల్లీ మ్యాప్‌ షేపే మారిపోయింది’’ అంటూ సాగే వీడియోను అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

తెలుగు సినీరంగంలో అద్భుతమైన నటుడిగా త‌న‌దైన ముద్రతో విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడిగా కొనియాడబడ్డారు ఎన్‌టీ రామారావు. అంతేకాదు పార్టీ పెట్టిన అనతి లంలో ముఖ్య‌మంత్రి పదవిని అలంకరించిన ఘనతను సాధిచారు. రాజ‌కీయ నాయ‌కుడిగా తనదైన శైలిలో ఆదరణ పొందారు. కాగా 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట పలు బ్లాక్‌ బస్టర్‌ మూవీలను అందించిన సంగతి
https://twitter.com/RaamAchanta/status/1351059673521262595