మన బాలుకు అంతర్జాతీయ గౌరవం

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందక ముందు ఎన్నో జాతీయ అంతర్జాతయ అవార్డులు.. రివార్డులు గుర్తింపులు గౌరవాలను దక్కించుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా ఎస్పీ బాలు మరిన్ని పుష్కరాలను దక్కించుకుంటున్నారు. తాజాగా మరో అంతర్జాతీయ గౌరవం మన బాలుకు దక్కింది. తెలుగు వారు అంతా గర్వించేలా మెల్ బోర్న్ లో జరిగే ఫిల్మ్ ఫెస్ట్ IFFM లో అత్యున్నత పురష్కారంను దక్కించుకోబోతున్నాడు. అత్యున్నత గౌరవంను దక్కించుకున్న వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ గౌరవంను మృతి చెందిన తర్వాత బాలు దక్కించుకున్నారు.

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM) నిర్వహించబోతున్న కార్యక్రమంకు సంబంధించిన డేట్లు అధికారికంగా ఖరారు చేయడం జరిగింది. ఆగస్టు 12 నుండి మొదలు పెట్టి వారం పాటు కొనసాగించి ఆగస్టు 20 వరకు కొనసాగించబోతున్నారు. కరోనా కారణంగా ఈ సారి ఎడిషన్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్యక్రమంను లైవ్ ద్వారా చూడబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదిక పై బాలు గారికి గౌరవ పురష్కారంను ప్రకటించబోతున్నారు.

గత ఏడాది సెప్టెంబర్ లో మృతి చెందిన బాల సుబ్రమణ్యం మొదటి వర్థంతిని భారీ ఎత్తున చేసేందుకు గాను కుటుంబ సభ్యులు మరియు అభిమానులు స్వచ్చంద సంస్థలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే IFFM వంటి అంతర్జాతీయ పురష్కారం దక్కడం తో ఆయన గౌరవం మరింతగా పెరిగింది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించేంతటి పాటలను పాడిన బాలు కరోనా కారణంగా అనారోగ్యం పాలయ్యి మృతి చెందిన విషయం అందరికి తెల్సిందే. ఆయన మృతితో సంగీత లోకం మూగ పోయనట్లయ్యింది.