గవర్నర్‌ దత్తాత్రేయ కారు ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌.. మాజీ కేంద్ర మంత్రి.. బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బండారు దత్తాత్రేయకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుతోంది.

కారులో దత్తాత్రేయతో సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు మరియు డ్రైవర్‌ మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు పై నుండి చెట్లల్లోకి కారు దూసుకు పోవడంతో పాటు కొద్ది పాటి లోయలో కూడా కారు పడింది. ఎస్కార్ట్‌ వాహనం ఒక్కసారిగా ఆపడంతో వెనుక వస్తున్న దత్తాత్రేయ కారు కూడా ఆగిపోయింది. దాంతో అదుపు తప్పి డ్రైవర్‌ కారును చెట్లలోకి మళ్లించాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రమాదంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం సంఘటన తెలిసి పలువురు ప్రముఖులు దత్తాత్రేయను ఫోన్‌ ద్వారా పరామర్శించారు.