బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన అల్లుడు అదుర్స్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి రివ్యూవర్స్ నుండి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎంతగా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నా కూడా యూనిట్ సభ్యులు మాత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సురేష్ మాట్లాడుతూ.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఓవర్ యాక్షన్ చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఔను మా వాడు ఓవర్ యాక్షన్ చేశాడు. సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే ఎంటర్ టైన్ ఉండాల్సిందే. ఎంటర్ టైన్ కోసం హీరోలు కాస్త ఓవర్ యాక్షన్ చేయాలి. చాలా మంది హీరోలు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. మా వాడు చేస్తే తప్పు ఏంటీ అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. ఎంటర్ టైన్ మెంట్ కోసం చేశాడు తప్ప మరేం లేదు. సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతోనే అలా చేశాడని పేర్కొన్నాడు.