బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో డెబ్యూ సినిమాగా తెలుగులో ఐకానిక్ హిట్ గా నిలిచిన ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన వివి వినాయక్ దర్శకుడిగా ఛత్రపతి రీమేక్ రూపొందనుంది. గత నెలలో ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు.
అలాగే హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు కూడా. దీనికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇటీవలే కురిసిన వర్షాలకు ఈ సెట్ చాలా మటుకు నష్టపోయిందట. హైదరాబాద్ శివార్లలో విలేజ్ సెట్ ను వేశారు. ఇప్పుడు దీనికి ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేపట్టారు.
సెట్ మళ్ళీ సిద్ధం కాగానే షూటింగ్ ను మొదలుపెడతామని తెలిపారు. పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలను తెలియజేయాల్సి ఉంది.