ఎన్టీఆర్, బాలయ్యలకు నా తల్లే పచ్చ కామెర్ల మందు ఇచ్చారు – భానుచందర్

ప్రముఖ నటుడు భానుచందర్ ఇటీవలే తన సినీప్రయాణంలో కీలక విశేషాలను ఒక యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. తనకు ఎన్టీఆర్ అంటే ఏంతో గౌరవమని, ఆయన కూడా తనకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని భానుచందర్ తెలిపారు. సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి నటించే భాగ్యం దక్కింది. ఒకరోజు సెట్లో రెండే కుర్చీలు ఉన్నాయి. ఒకదాంట్లో ఎన్టీఆర్ కూర్చున్నారు. మరొక దాంట్లో ఏఎన్నార్.

నేను పక్కనే నిలబడి ఉన్నాను, ఎన్టీఆర్ గారు నన్ను చూసి ఏం బ్రదర్ టిఫిన్ తిన్నారా, ఏంటి నిలబడే ఉన్నారు, ఆయనకు కుర్చీ వేయండి అని అన్నారు. అక్కడ అందరూ పెద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు, వాళ్ళ ముందు కూర్చోవడం ఇబ్బందే. కానీ ఎన్టీఆర్ మాటకు ఎదురుచెప్పే ధైర్యం ఎవరికి ఉంది? అని భానుచందర్ అన్నారు. అలాగే తన తల్లి ఎన్టీఆర్, బాలకృష్ణలకు పచ్చ కామెర్లు వచ్చినప్పుడు మందు ఇచ్చారని, తన తల్లిని ఎన్టీఆర్ గారు అక్కయ్య అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు భానుచందర్.