పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మినహా మొత్తం పూర్తయింది. నిజానికి సంక్రాంతికే రావాల్సిన భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్ కోసమని ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు కూడా కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాయిదా పడ్డాయి.
ఇక ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఆచార్య, మేజర్ వంటి సినిమాలు వాయిదా పడిన నేపథ్యంలో భీమ్లా నాయక్ మాత్రం అనుకున్న సమయానికి వస్తుందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని తెలుస్తోంది. ఎందుకంటే భీమ్లా నాయక్ వచ్చేది ఫిబ్రవరి 25న. అప్పటికి కరోనా పీక్ స్టేజ్ ను క్రాస్ చేసి తగ్గుముఖం పడుతుందని అంటున్నారు.
పైగా రెండు నెలలుగా సరైన సినిమా లేక ఉన్న ప్రేక్షకులకు భీమ్లా నాయక్ మంచి రిలీజ్ అని నమ్ముతున్నారు.