స్వాతిలో అది నాకు న‌చ్చలేదు: లాస్య‌


బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ కంటెస్టెంట్లు ప‌క్కా ప్లాన్‌తోనే హౌస్‌లో అడుగు పెట్టార‌ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బ‌ల్ల‌గుద్ది మరీ చెప్తున్నారు. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలీదు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు మాత్రం ఎలా ఆడా‌ల‌నేది ముందే డిసైడ్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. కాగా ‘100 శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్’ అన్న మాట‌ను నిల‌బెట్టుకోలేక‌పోతున్న త‌రుణంలో బిగ్‌బాస్‌ టీమ్ ముక్కు అవినాష్‌ను హౌస్‌లోకి దించింది. ఎవ‌రెలాంటి వారు? హౌస్‌లో ఏం జ‌రుగుతోంది? అని రెండువారాల‌పాటు బాగానే ప‌రిశీలించిన‌ అవినాష్ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసిపోయి ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. (చ‌ద‌వండి: అఖిల్‌ను ద‌త్త పుత్రుడు చేసుకుంటా: గ‌ంగ‌వ్వ‌)‌

లాస్య చేసిన త‌ప్పే కుమార్ చేశాడు
కానీ అత‌డి క‌న్నా ముందొచ్చిన కుమార్ సాయి మాత్రం అటు వాళ్ల‌తో క‌ల‌వ‌లేక‌, అలా అని ఒంట‌రిగా ఉండ‌లేక, త‌న‌కే అర్థం కాని ఓ అయోమ‌యంలో ప‌డిపోయాడు. దీన్ని అవ‌కాశంగా మలుచుకున్న ఇత‌ర కంటెస్టెంట్లు కుమార్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో న‌వ్విస్తాన‌ని వ‌చ్చిన అత‌డు బాధ‌లో కొట్టుమిట్టాడుతున్నాడు. పైగా నిన్న‌టి ఎపిసోడ్‌లో అభిజిత్‌, అఖిల్ విష‌యం గురించి ఇత‌ను ప్ర‌స్తావించి గొడ‌వ చేయ‌డం మొద‌టికే మోసం వ‌చ్చింది. అన‌వ‌స‌రంగా గ‌త వారం లాస్య చేసిన త‌ప్పే ఈసారి కుమార్ చేశాడ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నేడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ)

స్వాతి ప్లాన్ నాకు న‌చ్చ‌లేదు
ఇదిలా వుంటే మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతి దీక్షిత్ హౌస్‌లో ఎంట‌ర్ అయింది. మ‌రిన్ని ల‌వ్‌స్టోరీలు క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతోనే ఆమెను తీసుకొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక ఇంట్లోకి ప్ర‌వేశించి ఇంకా రెండు రోజులే అవుతుంది, కాబ‌ట్టి ఇప్ప‌టివ‌ర‌కు ఆమె గురించి ఎవ‌రూ త‌ప్పుగా అన‌లేదు. కానీ లాస్య మాత్రం ఆమెలో త‌న‌కు ఒక విష‌యం న‌చ్చ‌లేద‌ని అంద‌రి ముందే బ‌హిరంగంగా వెల్ల‌డించింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవ‌రెవ‌రితో స్నేహం చేయాలి? ఎవ‌రితో క్లోజ్‌గా ఉండాల‌నేది స్వాతి ముందుగా డిసైడ్ చేసుకుని వ‌చ్చింద‌ని పేర్కొంది. ఆమె అభిజిత్‌, హారిక‌, నోయ‌ల్‌, మ‌రో ఇద్ద‌రు ముగ్గురితో ఎక్కువగా ఉంటోంద‌ని చెప్పింది. లాస్య చెప్పిన పేర్ల‌ను చూస్తే నిజంగానే ఆమె ప్లాన్ చేసుకుని వ‌చ్చిందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే ఆమె ప్ర‌స్తావించిన వాళ్లంద‌రూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మాత్ర‌మే కాకుండా ఇప్ప‌ట్లో ఎలిమినేట్ అయ్యేందుకు ఆస్కార‌మే లేని వారు కావ‌డం గ‌మ‌నార్హం.