బిగ్ బాస్ సీజన్-15 విజేతగా నిలిచి ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది తేజస్వీ ప్రకాష్. హిందీ బిగ్ బాస్ లో మహిళా విజేతలు కొత్తేం కాదు. కానీ తేజస్వీ ఉత్తరాదిన సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అయింది. అందం..అభినయంతో పాటు..అమ్మడిలో చలాకీతనం సహా కొన్ని క్వాలిటీలు బాలీవుడ్ జనాల్ని ఆకర్షించాయి. బుల్లి తెర నటి అయినా తేజస్వీ బిగ్ బాస్ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
ఆ క్రేజ్ తో బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుందని ప్రచారం సాగింది. ఈ నేనపథ్యంలోనే ఆయుష్మాన్ ఖురానా సరసన ఛాన్స్ అందుకుందని వెలుగులోకి వచ్చింది. ‘డ్రీమ్ గర్ల్’ కి సీక్వల్ గా తెరకెక్కనున్న ‘గ్రీమ్ గర్ల్ -2’లో అమ్మడు అవకాశం వచ్చిందని బాలీవుడ్ లో ఇంటా బటయ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఈ భామకి పోటీగా నిలిచిన సారా అలీఖాన్ ని సైతం వెనక్కి నెట్టి మరీ అవకాశం అందుకుటుందని మీడియా కోడై కూసింది. కానీ అనూహ్యంగా ఆ ఛాన్స్ ఆ ఇద్దర్నీ గాక ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తన్నుకుపోయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా చిత్ర బృందం అనన్య ని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్ పై తేజస్వీ చాలా ఆశలే పెట్టుకుంది. బుల్లి తెర నటిగా ప్రయాణం మొదలు పెట్టిన అమ్మడు అటుపై బిగ్ బాస్ కి రావడం..విజేతగా నిలవడం…యువతలో ఫేమస్ అవ్వడం సహా అన్ని సినిమాలో అవకాశం కల్పిస్తాయని భావించింది. కానీ చివరి నిమిషంలో ఆఛాన్స్ అనన్యని వరించినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక పెద్ద రాజకీయమే జరిగిందని కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు రాసుకొస్తున్నాయి.
అనన్య బాలీవుడ్ పరిచయాల్ని వినియోగించుకుని ఆ ఛాన్స్ తనకు దక్కేలా చక్రం తప్పిందని అంటున్నారు. ఈ విషయం ముందే తెలిసే సారా అలీఖాన్ పోటీ ఎందుకని ప్రాజెక్ట్ ని లైట్ తీసుకుందని వినిపిస్తుంది. కానీ తేజస్వీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నాయిక కావడం సహా పరిచయాలు అంతంత మాత్రం కావడం ఈ అవకాశానికి దూరమ్యేలా చేసాయని తెలుస్తోం ది.
అనన్య పాండే కూడా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కాకపోతే బ్యూటీకి మంచి బ్యాకప్ ఉంది. నటిగానూ ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికే మూడు..నాలుగు సినిమాలు చేసింది. టాలీవుడ్ కి ‘లైగర్’ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లోనూ మరో కొత్త సినిమాలో నటిస్తుంది. ఇలా కొన్ని కారణాలు ! ఆ ఛాన్స్ అన్యన్య ని వరించేలా..తేజస్వీని దూరం చేసేలా చేసాయన్నది నిపుణుల మాట.