బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మరొక నాలుగు రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ కూడా మొదలవుతుంది. ఇక ఈ వారం మొదలు నుండి ఫైనల్స్ కు చేరిన ఐదుగురి జర్నీస్ ను చూపిస్తోన్న విషయం తెల్సిందే. మొన్నటి ఎపిసోడ్ లో శ్రీరామ్ చంద్ర, మానస్ ల జర్నీస్ ను చూపిస్తే, నిన్నటి ఎపిసోడ్ లో షణ్ముఖ్, సన్నీల వంతు వచ్చింది.
అయితే అంతకంటే ముందు ఫైనల్స్ కు రావడం గురించి సన్నీ, మానస్ – సిరి, షణ్ముఖ్ లు గ్రూప్స్ గా డిస్కస్ చేసుకున్నారు. మానస్ తన జర్నీ వీడియో అద్భుతంగా ఉందని చెబుతూనే షణ్ముఖ్ తన గురించి అన్న మాటలు సన్నీకి చెప్పుకున్నాడు. ఇక సిరి, షణ్ముఖ్ మరోసారి గొడవపడ్డారు. అయితే ఈసారి సిరి కోపం తెచ్చుకోగా షణ్ముఖ్ సారీ చెప్పాడు. ఆ తర్వాత షణ్ముఖ్ మరోసారి సిరి కాబోయే భర్త శ్రీహాన్ వచ్చి సన్నీని టాప్ ప్లేస్ లో ఎందుకు పెట్టాడు అంటూ గొడవ పడ్డాడు.
ఇక ముందుగా షణ్ముఖ్ బిగ్ బాస్ జర్నీ వీడియోను చూపించాడు. షణ్ముఖ్ తన జర్నీ ఫోటోలను బాగా ఎంజాయ్ చేసాడు. ఒక్కొక్క మెమరీని తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ జర్నీ వీడియో కూడా అద్భుతంగా కట్ చేసారు. షణ్ముఖ్ బిగ్ బాస్ జర్నీలో వచ్చిన అప్స్ అండ్ లోస్ ను చక్కగా చూపించారు. సిరి, షణ్ముఖ్, జెస్సీల మధ్య బాండ్, సన్నీతో జరిగిన గొడవ.. ఇలా ఫుల్ ప్యాకేజ్ లా ప్రోజెక్ట్ చేసారు. మొత్తంగా షణ్ముఖ్ తన బిగ్ బాస్ జర్నీని మొత్తం ఎంజాయ్ చేసాడు.
ఆ తర్వాతి వంతు సన్నీది. సన్నీ అంటే సరదాకు మారు పేరు అంటూ బిగ్ బాస్ అభివర్ణించడం బాగుంది. అలాగే సన్నీ ఎక్కువగా కోపం తెచ్చుకున్నాడు. ఎక్కువగా అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇవన్నీ బిగ్ బాస్ జర్నీలో చూపించారు. సిరితో జరిగిన గొడవ, శ్రీరామ్ చంద్ర, ప్రియాలతో జరిగిన గొడవలు బాగా ప్రోజెక్ట్ అయ్యాయి. ఇక షణ్ముఖ్ తో జరిగిన అప్పడం డిస్కషన్, యూట్యూబర్ కామెంట్ హైలైట్ అయింది. దానికి సరైన రీతిలోనే సన్నీ పంచిన ఎంటర్టైన్మెంట్ ను కూడా చూపించారు. సన్నీ కూడా తన వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు.
ఇక చివరిగా కేక్ గార్డెన్ ఏరియాలో పెట్టగా దాన్ని తన హౌజ్ మేట్స్ కోసం తీసుకెళ్లాడు సన్నీ.