తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ మరియు మోనాల్ ల వ్యవహారం షో కు మంచి హైప్ ను తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. అఖిల్ తో మోనాల్ స్నేహం మరియు అంతకు మించిన వ్యవహారం కారణంగానే ఆమె చివరి వరకు ఎలిమినేట్ కాకుండా ఉండగలిగింది అంటూ చాలా మంది అభిప్రాయం. అఖిల్ కూడా కేవలం మోనాల్ తో రిలేషన్ కారణంగా ఫినాలే వరకు వచ్చాడు అనేది కొందరి అభిప్రాయం.
కొందరు మాత్రం ఇద్దరు కూడా కేవలం టీఆర్పీ కోసమే ఖచ్చితంగా రిలేషన్ షిప్ ను కొనసాగించి ఉంటారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. బిగ్ బాస్ అంటేనే స్క్రిప్ట్ అనే విషయం చాలా మంది అనుకుంటారు. కనుక వీరి ప్రేమ వ్యవహారం కూడా అంతే అయ్యి ఉంటుంది.. బయటకు వెళ్లిన తర్వాత ఎవరి దారి వారిది అన్నట్లుగానే ఉంటారు అని అనుకుంటారు. కాని కొన్ని రిలేషన్ లు మాత్రం బయట కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి.
అఖిల్ మరియు మోనాల్ ల వ్యవహారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా స్నేహంతో కొనసాగుతుందట. ఆ విషయాన్ని స్వయంగా అఖిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అఖిల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ అనే విషయం తెల్సిందే. ఆయన ఒక సందర్బంలో ఇంటి సభ్యులకు తమ రిలేషన్ షిప్ గురించి తెలియజేశాడు. మోనాల్ తో నీ రిలేషన్ షిప్ కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమేనా అంటూ ప్రశ్నించారు.
అందుకు అఖిల్ స్పందిస్తూ.. మోనాల్ తో నా రిలేషన్ షిప్ జెన్యూన్. బిగ్ బాస్ తర్వాత కూడా మేము ఇద్దరం తరచు కలుసుకోవడం.. ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకోవడం చేస్తూ ఉంటాం. చాటింగ్ మరియు మీటింగ్ లు మా ఇద్దరి మద్య జరుగుతున్నాయని అన్నాడు. బిగ్ బాస్ కోసమే మేము ఇద్దరం స్నేహంను రిలేషన్ ను నటించలేదు అంటూ అఖిల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
బిగ్ బాస్ లో ఉన్నప్పటి కంటే మా ఇద్దరి మద్య ఇప్పుడు స్నేహం మరింత పెరిగింది అన్నట్లుగా అఖిల్ పేర్కొన్నాడు. అఖిల్ మరియు మోనాల్ ల జోడీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో ఈసారి మోనాల్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి పంపించాలని అభిమానులు కొందరు కోరుకుంటున్నారు. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ లో అఖిల్ లో చాలా మార్పు కనిపిస్తుంది.
అఖిల్ గత సీజన్ ల్లో చాలా సీరియస్ గా కనిపించేవాడు. కాని ఈసీజన్ లో మాత్రం చాలా జోవియల్ గా ఇంటి సభ్యులతో కలిసి పోయేందుకు ప్రయత్నాలు చేస్తు ఉన్నాడు. గత సీజన్ లో నవ్వడం కూడా పెద్దగా ఇష్టపడని అఖిల్ ఈ సీజన్ లో మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నాడు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ ఈసారి కూడా ఖచ్చితంగా టాప్ కంటెస్టెంట్ అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.