వి6 న్యూస్‌లో ఉన్నపుడు శివజ్యోతి అంటే ఎవరికీ తెలియదు. అప్పుడు అంతా తీన్మార్ సావిత్రి అన్నారు. కానీ బిగ్ బాస్ 3కి వచ్చిన తర్వాత సావిత్రి కాస్తా శివజ్యోతి అయిపోయింది. అప్పట్నుంచి ఈమెకు క్రేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. వి6 నుంచి ఇప్పుడు టివి 9కి వచ్చి అక్కడ వార్తలు చదువుకుంటుంది ఈమె. ఇప్పుడు శివజ్యోతి అంటే అందర్లాంటి యాంకర్ మాత్రమే కాదు.. సెలబ్రిటీ కూడా. బిగ్ బాస్ పుణ్యమా అని బాగానే పాపులర్ అయింది. ఇక ఇప్పుడు ఈమె జీవితాన్ని, లైఫ్ స్టైల్‌ను బిగ్ బాస్ పూర్తిగా మార్చేసింది. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత జ్యోతక్క లైఫ్ మారిపోయింది.
జీవితంలో ఎవరికైనా సొంతింటి కల ఉంటుంది. అది శివజ్యోతికి కూడా ఉండేది. అప్పటికే మొదటి కలను నెరవేర్చుకుంది ఈమె. అదే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం. సొంత వాళ్లను ఎదిరించి మరి ప్రేమించిన గంగూలీని పెళ్లి చేసుకుంది ఈమె. ఇక ఇంటి కలను కూడా నెరవేర్చుకుంది. బిగ్ బాస్ షోకు వెళ్లొచ్చిన తర్వాత ఈమె ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయిపోయింది. ఆ మధ్య గృహప్రవేశం చేసినపుడు విడుదలైన వీడియోలు చూస్తేనే శివజ్యోతి ఇల్లు ఎంత పెద్దగా ఉందనేది అర్థమైపోయింది. ఇప్పుడు మరోసారి యూ ట్యూబ్‌లో శివజ్యోతి ఇంటి వీడియోలు దర్శనమిస్తున్నాయి.
జ్యోతక్క ఇంటితో పాటు సొంత కారు కూడా సంపాదించుకుంది. ఈ రోజు ఆమెకు లేనిదంటూ ఏం లేదు. బిగ్ బాస్ పుణ్యమా అని ఇల్లు, కార్ వచ్చేసాయి. హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంది. తాజాగా ఈమె ఇంటి వీడియో చూసిన ప్రేక్షకులు షాక్ అయిపోతున్నారు. విశాలమైన హాల్.. పూజ గది.. బెడ్రూమ్స్.. అదిరిపోయే ఇంటీరియర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. దానికితోడు ఖరీదైన వస్తువులు కూడా ఇంట్లో బాగానే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాతే శివజ్యోతి లైఫ్ మారిపోయింది. మరోవైపు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఖరీదైన బెంజ్ కార్‌తో పాటు సొంతింటిని తీసుకున్నాడు. చాలా మంది జీవితాలను బిగ్ బాస్ అలా సెటిల్ చేసిందన్నమాట.