బిగ్‌బాస్‌; లో ఈరోజు ఇవ్వబోతున్న టాస్క్‌ ఇదే

బిగ్‌ బాస్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వారం మొత్తం కూడా కంటెస్టెంట్స్ తమ ప్రదర్శణ ఆధారంగా ఓట్లు పొందాలంటూ బిగ్‌ బాస్ ఆదేశించాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తూనే బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు ఓట్ల కోసం రిక్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఓపిక టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఇందులో భాగంగా సోహెల్‌ను విజేతగా నేడు ప్రకటించనున్నారు. ఇదే సమయంలో బిగ్‌ బాస్‌ నుండి మరో టాస్క్‌ ను ఆ అయిదు మంది సభ్యులకు ఇవ్వడం జరిగింది.

డ్రస్‌ లు మడత పెట్టడం, ఆలు పొట్టు తీయడం, మసాలా దినుసులను లెక్కించడం, మొక్క జొన్నలను వలచడం వంటి టాస్క్‌ లను ఇచ్చారు. ఈ టాస్క్‌ ల్లో విజేత అయిన వారికి ఓట్ల అప్పీల్‌ అవకాశం ఉంటుంది. ఈ టాస్క్‌ లు ఫన్నీగా ఉండటం కోసం ఇతర సభ్యలు డిస్ట్రబ్‌ చేసే అవకాశంను బిగ్‌ బాస్‌ ఇవ్వడం జరిగింది. మొత్తానికి బిగ్‌ బాస్‌ హౌస్‌ లో మళ్లీ సందడి కనిపించబోతుంది. ఇక నేటి ఎపిసోడ్‌ లో అరియానా మరియు సోహెల్‌ల మద్య గొడవ తారా స్థాయికి చేరబోతుంది. ఓపిక టాస్క్‌లో భాగంగా ఇద్దరు పెద్ద గొడవ పెట్టుకోబోతున్నారు. ఈ గొడవ ఎవరికి మైనస్‌ ఎవరికి ప్లస్‌ అనేది తెలియాల్సి ఉంది.