బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 94 – సహనం కోల్పోయి రచ్చ చేసిన సోహెల్‌ ‘ఓపిక’ టాస్క్‌ విజేత

బిగ్‌ బాస్‌ ఈ వారం టాస్క్‌ ల్లో భాగంగా ఓట్లు అడిగేందుకు ఆటలు ఇచ్చాడు. ఈ ఆటల్లో విజేతగా నిలిచిన వారు గోల్డ్‌ మైక్‌ తీసుకుని కన్ఫెషన్‌ రూంలో ప్రేక్షకులను ఓట్లు కోరే అవకాశం ఉంటుంది. అఖిల్‌ మినహా ప్రతి ఒక్కరు కూడా టాస్క్‌ లో పాల్గొన్నారు. మొదట రాజారాణి టాస్క్‌ లో అరియానా విజేతగా నిలువగా ఓపిక టాస్క్‌ లో సోహెల్‌ ను విజేతగా అఖిల్‌ ప్రకటించాడు. ఈ టాస్క్‌ లో భాగంగా ఎవరు ఏం చేసినా కూడా సోహెల్‌ కనీసం కదల్లేదు. నవ్వకుండా, కోపం తెచ్చుకోకుండా, ఎక్స్‌ ప్రెషన్‌ మార్చుకోకుండా సోహెల్‌ జీరో మార్కులు సాధించాడు. దాంతో ఓపిక టాస్క్‌ విజేతగా సోహెల్‌ నిలిచాడు. టాస్క్‌ లో విజేతగా నిలిచిన సోహెల్‌ టాస్క్‌ తర్వాత మాత్రం సహనం కోల్పోయి ఓపిక వదిలేసి అరియానాపైకి వెళ్లి రచ్చ చేశాడు.

సోహెల్‌ ఓపిక టాస్క్‌ లో ఉన్న సమయంలో వెళ్లి తన తన బొమ్మను ఎందుకు పూల్‌ లో పడేశావు, నాకు ఇష్టమైన డ్రస్‌ ను ఎందుకు పూల్‌ లో పడేశావు అంటూ అడిందింది. దీనికి నాకు సమాధానం కావాల్సిందే. నువ్వు చేస్తే ఆట నేను చేస్తే టాస్క్‌ అనడం ఎంత వరకు కరెక్ట్‌ సోహెల్‌ అంటూ కాస్త సీరియస్‌ గానే ప్రశ్నించింది. దాంతో టాస్క్‌ తర్వాత సోహెల్‌ బరాబర్‌ అలాగే చేస్తా అంటూ మాట్లాడాడు. దాంతో అరియానాకు మరింత కోపం వచ్చింది. ఇది నీ ఆట నీవు ఇలా ఆడుతావు అంటూ అతడిని మరింతగా రెచ్చగొట్టింది. దాంతో ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. సోహెల్‌ ఆవేశంతో అరియానా మీదకు వెళ్లాడు. ఒకానొక సమయంలో ఆమెపై చేయి చేసుకుంటాడా అన్నంతగా పరిస్థితి మారిపోయింది.

ఇద్దరి మద్య అఖిల్‌ అభిజిత్‌ నిలవడంతో కాస్త సైలెంట్‌ అయ్యింది. సోహెల్‌ ప్రవర్తనతో అరియానా బోరున ఏడ్చేసింది. నేను బిగ్‌ బాస్ చెప్పే టాస్క్‌ మాత్రమే చేస్తున్నా కదా అంటూ కింద పడి ఏడ్చింది. ఆ తర్వాత ఎవరితో మాట్లాడకుండా పక్కకు వెళ్లి కూర్చుంది. ఒకానొక సమయంలో మోనాల్‌ వెళ్లగా నీతో మాట్లాడటం ఇష్టం లేదు అంటూ పక్కకు వెళ్లి కూర్చుండి పోయింది. ఇక ఓపిక టాస్క్ లో విజేత అయిన సోహెల్‌ కన్ఫెషన్‌ రూంకు వెళ్లి ఓట్లు అడిగాడు. ఆ సమయంలోనే తన కోపంపై పశ్చాతాపం వ్యక్తం చేశాడు. ఆమె నన్ను రెచ్చగొట్టడంతో నేను అదుపు తప్పాను అంటూ సోహెల్‌ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. సోహెల్ తాజా ఎపిసోడ్‌ తో అంతో ఇంతో బ్యాడ్‌ అయ్యాడు అనిపించింది.