బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 96 – మరో అవకాశం దక్కించుకున్న అరియానా

ఈవారం బిగ్‌ బాస్‌ లో అఖిల్‌ మినహా మిగిలిన అంతా కూడా నామినేట్‌ అయ్యారు. వారు నామినేషన్‌ నుండి సేవ్‌ అవ్వడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం టాస్క్‌ లు చేస్తూ విజేతలుగా నిలిచి కన్ఫెషన్‌ రూంలోకి వెళ్లి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం దక్కించుకుంటున్నారు. అరియానా మరియు సోహెల్‌ లు ఇప్పటికే ఓట్లు అడిగేశారు. మూడవ టాస్క్‌ లో మళ్లీ అరియానా విన్నర్‌ అయ్యింది. ఈసారి ఏదైనా ఒక పని చేస్తూ ఏకగ్రతగా ఉండి 30 నిమిషాల సమయంను అంచనా వేయాల్సి ఉంటుంది. వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉండవు కనుక 30 నిమిషాలకు ఎవరు దగ్గరగా అంచనా వేస్తారో వారిని విజేతగా నిలిపారు. ఈ టాస్క్ లో మోనాల్‌ ను విజేతగా నిలిపేందుకు అఖిల్‌ ప్రయత్నించాడు.

టాస్క్‌ చేస్తున్న వారు మనసులో సమయం లెక్కించుకోకుండా ఉండేందుకు ఇతర కంటెస్టెంట్స్‌ వారిని డిస్ట్రబ్‌ చేయవచ్చు. చిలిపి ప్రశ్నలు వేస్తూ వారి నుండి ఫన్నీ ఆన్సర్స్‌ రాబడుతూ టాస్క్‌ ను ఎంటర్‌ టైన్‌ చేయవచ్చు. ఇందులో భాగంగా మొదట మోనాల్‌ ఈ టాస్క్‌ ను చేసింది.

మొదట అఖిల్ ఈ టాస్క్‌ లో ఆమెకు సాయం చేస్తానంటూ చెప్పినట్లుగానే తనలో తాను లెక్కించుకోవడం మొదలు పెట్టాడు. దాన్ని హారిక డిస్ట్రబ్‌ చేసేందుకు ప్రయత్నించినా కూడా బాత్‌ రూంలోకి వెళ్లి పోయాడు. టైమ్‌ అయ్యింది అనుకుంటున్న సమయంలో అఖిల్‌ వెళ్లి మోనాల్‌ వద్ద విజిల్‌ వేశాడు. దాంతో మోనాల్‌ కాస్త ఉండి లేచింది. ఆ తర్వాత ఇతర సభ్యులు కూడా టాస్క్‌ చేశారు.

అందరిలో కంటే అరియానా తక్కువ తేడాతో 30 నిమిషాలను గుర్తించింది. అఖిల్‌ సాయం చేసినా కూడా మోనాల్‌ చాలా ఏక్కువ సమయం లెక్కించింది. దాంతో ఈ టాస్క్‌ లో విన్నర్ గా అరియానా నిలిచి మళ్లీ ఓట్లు అడిగే అవకాశం దక్కింది.

ఇక అఖిల్‌ ఇతరులతో ముఖ్యంగా హారికతో పులిహోర కలపడం మోనాల్‌ కు అస్సలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని చెప్పి బ్యాడ్‌ అవుతావు అంటూ మోనాల్‌ అనడంతో అఖిల్‌ సీరియస్‌ అయ్యాడు. అప్పుడు నువ్వు అభితో ఉన్నప్పుడు నేను అదే అన్నాను. కాని నువ్వు పట్టించుకోలేదు కదా అంటూ లాజిక్‌ తీశాడు. మొత్తానికి ఇద్దరి మద్య మళ్లీ సీరియస్‌ చర్చ అయితే జరిగింది.