ఎక్స్ క్లూజివ్: బిగ్‌ బాస్‌ 4: నేటి ఎపిసోడ్‌ టాస్క్‌ ఇదే

బిగ్‌ బాస్‌ నుండి ఈసారి వచ్చినన్ని లీక్స్‌ ఇంతకు ముందు ఏ సీజన్‌ కు రాలేదు. రేటింగ్‌ రాకపోవడంతో కావాలని కూడా లీక్ లు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి, వస్తున్నాయి. ఇంతకు ముందు ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు అనే విషయంలో మాత్రమే లీక్‌ అయ్యేది. కాని ఇప్పుడు ఎపిసోడ్‌ ముందే టాస్క్‌ లు ఏంటీ అనే విషయాలపై లీక్‌ లు వస్తున్నాయి. మేము ప్రతి రోజు కూడా ఎపిసోడ్‌ కు ముందే వివరాలను మీకు అందిస్తున్నాం. శనివారం ఎపిసోడ్‌ కు సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకు వస్తున్నాం.

శనివారం ఎపిసోడ్‌ లో నాగార్జున వచ్చి నిన్న ఏం జరిగిందో చూపించబోతున్నాడు. అందులో స్కంధాన్సి ఇన్ఫ్రా కు సంబంధించిన ప్రమోషన్‌ ను చేయబోతున్నారు. కంటెస్టెంట్స్‌ ఆరుగురు ఎవరు ఎవరు ఎలాంటి ఇళ్లను కోరుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పబోతున్నారు. బాగా చెప్పిన వారికి చాక్లెట్‌ లు గిఫ్ట్‌ గా ఇస్తారు. అందరు కూడా బాగా చెప్పడంతో అందరికి కూడా చాక్లెట్స్‌ బహుమానంగా లభించాయి. ఇక ఈ రోజు ఒక్కరిని సేవ్‌ చేసి మిగిలిన ముగ్గురిని రేపు సేవ్‌ చేసి ఒక్కరిని ఎలిమినేట్‌ చేస్తారు. హారిక లేదా మోనాల్‌ ల్లో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.