బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 103 – హారిక, సోహెల్‌, అరియానాల ఎమోషనల్‌ జర్నీ

బుదవారం నాటి ఎపిసోడ్‌ లో అఖిల్‌ మరియు అభిజిత్ ల బిగ్ బాస్‌ జర్నీ చూపించారు. వారి గురించి బిగ్ బాస్‌ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అభిజిత్‌ మీరు ఇంట్లో ఉండటంను బిగ్‌ బాస్‌ గర్విస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక గురువారం ఎపిసోడ్‌ లో హారిక జర్నీతో మొదలు అయ్యింది. నిన్నటి ఎపిసోడ్‌ మొత్తం కూడా ఆ ఇద్దరితోనే పూర్తి అయ్యింది. వారి బిగ్‌ బాస్‌ జర్నీ కూడా చాలా ఎమోషనల్‌ గా సాగింది. హారిక నిన్న చోటు అన్నా కూడా నువ్వు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన తీరు అద్బుతం అంటూ బిగ్‌ బాస్‌ ప్రశంసించాడు. హారిక జర్నీ కూడా చాలా ఎమోషనల్‌ గా సాగింది. నవ్వులు పూయించడంతో పాటు కన్నీరు తెప్పించే విధంగా ఆమె వీడియోను చూపించారు.

సోహెల్‌ గురించి కూడా బిగ్‌ బాస్‌ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. మీరు పక్కింటి వారిగా మీ జర్నీని మొదలు పెట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నారు. ఇది మీ యొక్క గొప్పతనం. ఇక్కడ నుండి బయటకు వెళ్లిన తర్వాత కథ వేరే ఉంటుందని బిగ్‌ బాస్‌ స్వయంగా అనడంతో సోహెల్‌ ఆనందంకు అవధులు లేకుండా పోయాయి. మొత్తంగా ఈ బిగ్‌ బాస్‌ జర్నీ తనకు ఒక అద్బుతం అని, తన జీవితాన్ని మలుపు తిప్పింది అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా అరియానా తన జర్నీని చూసింది. ఆమె జర్నీలో కూడా ఎన్నో ఎత్తు పల్లాలు అద్బుతమైన మెమోరీస్ ను దాచి పెట్టుకుంది. అంతా ఒక్కటై మీరు ఒంటరీ అయిన సమయంలో మీరు గ్రేట్‌ అంటూ బిగ్‌ బాస్‌ ఆమెను ప్రశంసించాడు. మొత్తానికి కంటెస్టెంట్స్‌ జర్నీ రెండు ఎపిసోడ్స్‌ చూపించారు. మరి నేడు ఏం చూపించబోతున్నారో చూడాలి.