తెలుగులో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 సీజన్ ఆఖరు రోజుకి చేరుకుంది. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ ఉన్నంత బజ్ క్రియేట్ అవుతోంది. ఫైనల్ లో 5గురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. దీనికి ముందు బిగ్ బాస్ టీమ్ రీయూనియన్ నిర్వహించింది.
షో ప్రారంభమైన నుంచి ఎలిమినేట్ అయిన అందరూ హౌస్ లోకి వచ్చి ఫైనలిస్టులను ఎంకరేజ్ చేస్తున్నారు.. జ్ఞాపకాలను ప్రోది చేసుకుంటున్నారు. అయితే.. టీవీ9 దేవి మాత్రం వెళ్లలేదు. ఇందుకు ఆమె బిగ్ బాస్ మేనేజ్ మెంట్ పై ఉన్న కోపమే కారణం అంటున్నారు.
నిజానికి బిగ్ బాస్ లోకి దేవి ఎంటర్ అయిన తర్వాత ఆమె ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని చూసిన వారు ఉన్నారని అంటారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఆమెను ఎలిమినేట్ చేయాలని చూసారని అంటారు. మొత్తానికి ఆమె మూడో వారంలో ఎలిమినేట్ అయింది. అయితే.. ఆమెకు ఓట్లు తక్కువగా వచ్చిన కారణంగా ఎలిమినేట్ అయిందంటే నమ్మేవారూ తక్కువే.
దేవి కూడా తనకు ఓట్లు ఎక్కువే వచ్చాయని.. బిగ్ బాస్ కావాలనే తనను బయటకు పంపారని అనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను బిగ్ బాస్ లో ఉంటే ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుందని భావించారని కూడా చెప్పుకొచ్చింది.
పవన్ ఫ్యాన్స్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యానని అనుకోవడం లేదని కూడా చెప్పింది. బ్రింగ్ బ్యాక్ దేవీ అని ట్రెండ్ కావడాన్ని ఉదహరించింది. మొత్తానికి రీయూనియన్ కు దేవి వెళ్లలేదు. అసలే.. మీడియా ఫీల్డ్ లో ఆరితేరిన దేవికి ఈ రీయూనియన్ ఇన్విటేషన్ ఆసక్తి కలిగించలేదని అంటున్నారు. అందుకే రీయూనియన్ ను స్కిప్ చేసిందని అంటున్నారు. పైగా ఫినాలేకు కూడా దేవి రాలేదంటున్నారు.
దీంతో డోంట్ కేర్.. లైట్ అన్న చందాన వదిలేసిందని టాక్ వస్తోంది. రీయూనియన్ లో సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ కూడా రాలేదు కానీ.. ఫినాలేలో సందడి చేశారు.