తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ హౌస్ లో ఉన్న సమయంలో ఎక్కువగా హారికతో సమయం కేటాయించేవాడు. ఆమె ఒక వేళ తనతో కాకుండా వేరే వారితో ఉంటే నాతో సమయం ఎందుకు గడపడం లేదు అంటూ తెగ ఫీల్ అయ్యేవాడు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే బిగ్ బాస్ లో ఉన్న సమయంలోనే హారిక తనకు ఒక చెల్లి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. కాని ఎక్కువగా ఇద్దరి మద్య ప్రేమ ఉన్నట్లుగా షో నిర్వాహకులు ఎక్స్ పోజ్ చేసేలా ప్లాన్ చేశారు.
అభిజిత్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఎక్కువగా హారికను కలుస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవం వేడుకలో కూడా హారిక విషయమై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. యాంకర్ శ్రీముఖి మీరు ఎక్కువగా ఎవరిని మిస్ అవుతున్నారు అంటూ ప్రశ్నించగా నేను నోయల్ ను మిస్ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. హరిక కంటే కూడా అధికంగా నోయల్ అభిజిత్ తో బాండింగ్ ను పెంచుకున్నట్లుగా పేర్కొన్నాడు. దాంతో హారిక పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.