బిబి4 జోడీ హీరో హీరోయిన్ గా సినిమా షురూ

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 లో అందరి దృష్టిని ఆకర్షించిన జంట అఖిల్‌ సార్ధక్‌ మరియు మోనాల్‌ గజ్జర్‌. వీరిద్దరి జోడీ షో కు మంచి రేటింగ్‌ ను తెచ్చి పెట్టిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు వీరిద్దరి జోడీ కోసం చూశారు. కొన్ని సార్లు గొడవ పడటం ఎక్కువ సార్లు ప్రేమగా ఉండటం చేసుకునే వారు. మోనాల్‌ కు ఓట్లు రాకున్నా కెమిస్ట్రీ కారణంగా కొనసాగించారు అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ జోడీ ప్రస్తుతం సినిమాలో కలిసి హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

తెలుగు అబ్బాయి మరియు గుజరాతీ అమ్మాయి మద్య ప్రేమ చిగురించి అది ఎక్కడి వరకు దారి తీసింది అనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతుంది. షూటింగ్‌ ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి అఖిల్‌ మరియు మోనాల్‌ జోడీ సోషల్‌ మీడియాలో ట్రెడ్డింగ్‌ లోనే ఉంది. కనుక వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమాకు మంచి ఆధరణ దక్కే అవకాశం ఉందంటున్నారు. అఖిల్‌ వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. వైవిధ్యభరిత కాన్సెప్ట్ తో వీరిద్దరి కాంబో మూవీ తెరకెక్కుతున్నట్లుగా చెబుతున్నారు.