బిగ్ బాస్ తెలుగు-5 : పాలకూర గొడవ, లహరి రచ్చ- ఎపిసోడ్-4

అనీ మాస్టర్‌.. జెస్సీల గొడవ తాజా ఎపిసోడ్‌ లో కూడా కంటిన్యూ అయ్యింది. అయితే ఆ గొడవ ఈ ఎపిసోడ్‌ లో ముగిసింది. అనీ మాస్టర్ కు సారీ చెప్పిన జెస్సీ కాళ్లు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో అనీ మాస్టర్ కూడా గొడవకు ఫుల్‌ స్టాప్ పెట్టడం కోసం తన ప్రవర్తనకు సారీ చెప్పింది. మొత్తంగా ఎపిసోడ్ ఆరంభంలోనే ఇద్దరి మద్య వ్యవహారం ముగిసింది. ఇక కాజల్‌ కు అందరు పడుకున్న తర్వాత మాత్రమే పడుకోవాలనే టాస్క్ ఇచ్చిన విషయం తెల్సిందే. పవర్ రూమ్‌ టాస్క్ లో భాగంగా లహరితో పాటు ఇంకా పలువురు కూడా పడుకోకుండా ఉన్నారు. ఏ సమయంలో అయినా పవర్‌ రూమ్‌ బజర్ మోగే అవకాశం ఉంది. కనుక పడుకోము అంటూ హమీద మరియు లహరిలు అన్నారు. దాంతో కాజల్ పడుకోకుండానే ఉండాల్సి వచ్చింది.

లహరి మరియు కాజల్‌ ల మద్య ఆ సమయంలో కూడా మళ్లీ చర్చ జరిగింది. ఎంత చెప్పినా కూడా వారు పడుకోక పోవడం వల్ల కాజల్‌ బాగా నిద్ర వచ్చి పడుకుంది. రాత్రి అంతా కూడా కనీసం రెండు మూడు గంటలు కూడా పడుకోకుండా ఇంటి సభ్యులు కొందరు బజర్ మోగుతుందేమో అని ఎదురు చూశారు. కాని అది మోగలేదు. కాని కాజల్ పడుకుంటే అలారం సౌండ్ పెద్దగా వచ్చింది. దాంతో ఆమె ఉలిక్కి పడి రెండు సార్లు లేచింది. మొత్తానికి వాళ్లు పడుకోకుండా కాజల్‌ ను పడుకోనివ్వలేదు. ఇక ఉమాదేవి కిచెన్‌ లో ఉన్న వారిపై అరిచింది. తనకు పాలకూర ఇవ్వలేదు అని.. ప్రిడ్జ్‌ లో పెట్టారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనీ మాస్టర్‌ ఆ పాలకూరను చివరకు ఎవరైనా ఉంటే తింటారనే ఉద్దేశ్యంతో ఉంచాను అంటూ చెప్పింది. దాంతో ఉమాదేవి ఆమెపై కూడా ఫైర్‌ అయ్యింది. అలా ఎలా చేస్తారు అంటూ కాస్త సీరియస్‌ గానే ఉమాదేవి చేసిన రచ్చ హౌస్‌ లో కాస్త సీరియస్‌ నెస్ ను క్రియేట్‌ చేసింది.

ఇక పవర్ రూమ్ టాస్క్ విషయానికి వస్తే ఇంటి సభ్యులు చాలా అలర్ట్ గానే స్కానర్‌ వద్ద కాచుకుని కూర్చున్నారు. మూడవ బజర్ సమయంలో సిరికి పవర్ రూమ్ అవకాశం దక్కించుకుంది. పవర్‌ రూమ్‌ లోకి వెళ్లిన సిరికి బిగ్‌ బాస్ నుండి ఆపర్‌ వచ్చింది. ఒకరిని సేవకుడిగా ఒకరిని యజమానికి ఎంపిక చేసుకోండి అంటూ సూచించగా లోబోను సేవకుడిగా షన్ముక్‌ ను యజమానిగా ఎంపిక చేయడం జరిగింది. ఇక ప్రియాంకతో తన ను కలిపి ట్రాక్‌ క్రియేట్ చేయాలని చూడటం పై మానస్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రవి అలా అనడం కరెక్ట్‌ కాదన్నాడు. ఇంకా హమీదా మరియు లహరిల మద్య రచ్చ మొదలు అయ్యింది. మొత్తానికి తాజా ఎపిసోడ్‌లో కూడా హౌస్‌ లో వేడి వాడిగా చర్చలు జరిగాయి.. హాయిగా నవ్వుకునేలా లోబో సందడి చేశాడు. ఆలోచింపజేసే విధంగా కొందరు కంటెస్టెంట్స్ చేశారు.