బిగ్ బాస్ 5: టికెట్ టు ఫినాలే గెలుచుకునేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా ఫైనల్ వీక్ కు రెండు వారాలు మాత్రమే ఉన్నాయి. నిన్న నామినేషన్స్ ఎపిపోడ్ ఎంత వాడివేడిగా సాగిందో అందరం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు అత్యంత కీలకమైన టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలవుతోంది. హౌజ్ లో ఉన్న ఇప్పుడు ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడుగురు కంటెస్టెంట్స్ ఈ టాస్క్ లో పాల్గొంటారు.

టికెట్ టు ఫినాలే టాస్క్ ను మూడు లెవెల్స్ లో నిర్వహిస్తారు. ఈ మూడు లెవెల్స్ లో గెలిచిన వారు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. మొదటి లెవెల్ లో ఎండ్యూరెన్స్ టాస్క్ లో పాల్గొనాల్సి వస్తుంది. దీనిలో భాగంగా ఐస్ టబ్ లో కంటెస్టెంట్స్ నిలబడాలి. అలాగే దాంతో పాటు తమ పేరు మీద ఉన్న బాల్స్ ను కాపాడుకోవాల్సి వస్తుంది.

మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.