బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు పదో సీజన్ లో ఉంది. ఇప్పటికే తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు నామినేట్ అయ్యారు. మానస్, సన్నీ, కాజల్, రవి, సిరి నామినేషన్స్ లో ఉన్నారు. తన కామెడీ టైమింగ్ తో, టాస్క్ లలో 100 శాతం ఇవ్వడంలో సన్నీ ముందున్నాడు. దీంతో తన ఓటింగ్ టాప్ లోనే ఉంది. సిరి కూడా అంతే. రవి గత మూడు వారాల్లో బాగా పుంజుకున్నాడు. కాజల్ అందరిలో నెగటివ్ అయ్యి, ఓటింగ్స్ లో కూడా లీస్ట్ గా నిలిచింది.
ఇక హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న మానస్ సడెన్ గా డల్ అయ్యాడు. ఎందుకో గత రెండు వారాల నుండి అసలు ఎందులో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇవ్వట్లేదు. ఎంత సేపూ అయితే ప్రియాంకతో లేదా సన్నీతో కూర్చుని అందరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు.
ఇది ప్రేక్షకులకు రుచించట్లేదు. అందుకే తన ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పడిపోయింది.